calender_icon.png 8 November, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

08-11-2025 12:00:00 AM

-క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను గుర్తించాలి

- ప్రజల జీవితాల్లో త్వరితగతిన మార్పు తీసుకురావాలి

- నీతి ఆయోగ్ కేంద్ర ప్రభారీ అధికారి,డిప్యూటీ సెక్రటరీ,వాణిజ్యం,పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్వేష్ కుమార్

ములుగు,నవంబరు7(విజయక్రాంతి): అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను గుర్తించా లని, ప్రజల జీవితాల్లో త్వరితగతిన మార్పు తీసుకురావాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభా రీ అధికారి,డిప్యూటీ సెక్రటరీ,వాణి జ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్వేష్ కు మార్ అ న్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో కన్నాయిగూడెం బ్లాక్ కార్యక్రమం పై కేంద్ర ప్రబరీ అధికారి నీతిఆయోగ్ వాణి జ్య,పరిశ్రమల శాఖ డిప్యూటీ సెక్రటరీ అన్వేష్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎ స్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన కన్నాయి గూడెం బ్లాక్ అభివృద్ధిని కొలవడానికి ఆ కాంక్షిత బ్లాకుల కార్యక్రమం నిర్దేశించిన ఐ దు ప్రధాన రంగాలలో సాధించిన ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం మరియు పోషకాహారం గర్భిణీ స్త్రీలకు ప్రథమ త్రైమాసికంలో నమోదు, సంస్థాగత ప్రసవాలు, పిల్లల్లో పోషకాహార లోపంతగ్గింపు మరి యు అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. వ్యవసాయం మరియు అనుబంధ సేవలు కిసాన్ క్రెడిట్ కార్డు పంపిణీ, సూక్ష్మ నీటిపారుదల విస్తీర్ణం, సాయిల్ హెల్త్ కార్డుల జారీ మరియు పశువులకు టీకాలు వేసే కార్యక్రమాలపై దృష్టి సారించారు.

ప్రాథమిక మౌ లిక సదుపాయాలు ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీప్లస్ గ్రా మాల ప్రకటన, భారత్నెట్ కనెక్టివిటీ మరి యు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకింద గృహాల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. సామాజిక అభివృద్ధి స్వయం సహాయక బృందాలకు రివాల్వింగ్ ఫండ్ మంజూరు, కొత్త ఎస్‌హెచ్‌జీల ఏర్పాటు మరియు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల అమలును సమీక్షించారు.ఈ సందర్భంగా అన్వేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పథకాల కలయి క, కేంద్ర ప్రభారీ అధికారులు, జిల్లా కలెక్టర్ల సహకారం, మరియు బ్లాక్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ అనే మూడు ప్రధాన సూత్రాల పైనే ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం విజయవంతం ఆధారపడి ఉందని పునరుద్ఘాటిం చారు.

‘కన్నాయిగూడెం బ్లాక్లో పథకాల అ మలులో అధికారుల అంకితభావం అభినందనీయం. అయినప్పటికీ, కీలక సూచికలలో మరింత వేగంగా అభివృద్ధి సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సవాళ్లను గుర్తించి,లక్షిత జోక్యాల ద్వారా ప్రజల జీవితాల్లో త్వరితగతిన మార్పు తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమీక్ష కన్నాయిగూడెం బ్లాక్లో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చి, స్థానిక పరిపాలనలో జవాబుదారీతనాన్ని, పారదర్శకతను పెంచడానికి సహాయపడుతుందనిఅన్నారు.