08-11-2025 04:37:58 PM
మణుగూరు,(విజయక్రాంతి): పట్టణంలోని రేణుక చౌదరి క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గురిజాల గోపి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి గోపి కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులకు తినిపించి సంబరాలు జరుపు కున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి, గోపి నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. దేవాలయాలలో రేవంత్‌రెడ్డి పేరున అర్చన చేయించి పూజలు చేశారు.
ఈ సందర్భంగా గురుజాల గోపి మాట్లాడుతూ... గ్రామీణ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డికి సామాన్య ప్రజల కష్టసుఖాలు తెలుసునన్నారు. అందుకే అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. నిత్యం ప్రజల కోసం శ్రమించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనం సరోజ, ఎండి షబానా, వసంత,సుజాత, రేణుక, శైలజ, సౌజన్య,పార్వతి, మాధవరెడ్డి, వెంకటచారి పాల్గొన్నారు.