22-10-2025 02:15:20 AM
-సిద్దిపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి రా
-సీఎం అనుమతితో నేనూ వస్తా ..డేట్, టైం నువ్వే ఫిక్స్ చెయ్
-మాజీమంత్రి హరీశ్‌రావుకు రాష్ట్ర మంత్రి అడ్లూరి సవాల్
-లేదంటే క్యాబినెట్ భేటీపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : తెలంగాణ క్యాబినెట్ భేటీపై బీఆర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే.. ఆయన సెంటిమెం ట్‌గా భావించే సిద్ధిపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు రావాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అనుమతితో నేనూ వస్తానని డేట్, టైం ఫిక్స్ చేయాలని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. లేదంటే అబద్ధపు వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అం టారా? క్యాబినెట్ సమావేశంలో జరగని విషయాలను జరిగాయని ప్రచారం చేయడమేంటీ..? అని హరీశ్‌రావుపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అబద్ధాలకు కేరాఫ్‌గా మారిందని ధ్వమెత్తారు. హరీష్‌రావులాగా తమకు పైకి నవ్వి లోపల రాజకీయాలు చేయడం రాదని, ఆయన లాగా యాస, భాష తమకు తెలియదని, ప్రజలకు సేవ చేయడం మాత్రమే తెలుసన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ చీలికకు హరీశ్‌రావే కారణమని ఆయన ఆరోపించారు. రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిది. . బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సెటిమెంట్లు, దందాల గురించి కవిత చెప్పారని గుర్తుచేశారు.
హాస్టల్ విద్యార్థులకు మంచి చదువు ఇవ్వాలి : అడ్లూరి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తోందని, అందుకు అనుగుణంగా అధికారులు కూడా పని చేయాలని సూచించారు. గ్రూప్ 2 పరీక్షలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులుగా నియామకమైన అభ్యర్థులకు మంత్రి లక్ష్మణ్‌కుమార్ సచివాలయంలోని తన చాంబర్‌లో సోమవారం నియామక పత్రాలు అందజేశారు. హాస్టల్ విద్యార్థులకు మంచి చదువు, భవిష్యత్ ఇవ్వాలని ఈ సందర్భంగ మంత్రి కోరారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎస్సీడీడీ సెక్రటరీ బుద్ధప్రకాష్ పాల్గొన్నారు.