calender_icon.png 22 October, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రులే సమస్యలు సృష్టిస్తే ఎలా?

22-10-2025 02:16:52 AM

-అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలి 

-ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దు 

-మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్‌రెడ్డి సూచన

-భేటీలో వివరణ ఇచ్చుకున్న కొండా దంపతులు 

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : మంత్రులే సమస్యలు సృష్టిస్తే ఎలా..? వివాదాలకు తావిచ్చి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దు అని, అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు సోమవారం భేటీ అయ్యారు. దీపావళి పండుగ వేళ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

టీవల చోటు చోసుకున్న పరిణామాలపై సీఎంకు కొండా దంపతులు వివరించారు. అయితే కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యా ఖ్యలపై కొండా దంపతులు సీఎం రేవంత్‌రెడ్డితో విచారం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరకుండా చేసుకుంటామని హామీ చెప్పినట్లుగా సమాచారం. సీనియర్ మంత్రులుగా ఉన్న వాళ్లే.. వివాదాలకు తావిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంటుంది కదా..? ఏదైనా అంశం ఉంటే తనకు నేరుగా చెప్పుకునే వెసులుబాటు ఉందని, మీడియా ముందు కు వెళ్లడం వల్ల ప్రతిపక్షాలకు అస్త్రాన్ని ఇచ్చిన వారమవుతామని, భవిష్యత్తులో ఇలాంటి వాటికి తావులేకుండా ఉండాలని సీఎం సూచించినట్టు సమాచారం.

పార్టీ పరమైన అంశాలుంటే వాటన్నింటినీ పరిష్కరిం చుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల కాంగ్రె స్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల మధ్య చోటుచేసుకున్న వివాదంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ జోక్యం చేసుకోవడంతో కాస్త సద్దుమణిగిన విష యం తెలిసిందే. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయిన కొండా దంపతులు జరిగ ణ పరిణామాలపై వివరణ ఇచ్చుకన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.