calender_icon.png 22 October, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవుల్లో సగం కావాలి

22-10-2025 01:42:35 AM

కాంగ్రెస్‌లో బీసీల నుంచి పెరుగుతున్న డిమాండ్ 

పార్టీలో సామాజిక న్యాయం పాటించండి

  1. ఈ నెలాఖరులోగా డీసీసీ అధ్యక్షుల నియామకం 
  2. జిల్లాలవారీగా ఏఐసీసీ పరిశీలకుల సమావేశాలు 
  3. డీసీసీ అధ్యక్షుల విషయంలో అభిప్రాయ సేకరణ 
  4.   25న కేసీ వేణుగోపాల్‌తో భేటీ కానున్న ఏఐసీసీ పరిశీలకులు 
  5. రాష్ట్రంలో పార్టీ, రాజకీయ పరిస్థితులపై వివరించే అవకాశం

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో రిజర్వేషన్లపై చర్చ జోరుగా సాగుతున్నది. పార్టీలో 50 శాతం వరకు పదవులు బీసీలకు ఇవ్వాలనే డిమాం డ్ జోరందుకున్నది. ఈ నెలాఖరలోగా డీసీసీ అధ్యక్షులను నియమించే అవకాశం ఉండటంతో బీసీ వాదం బలంగా తెరపైకి వస్తున్నది. గతంలో పార్టీ పదవుల్లో రెండు, మూడు వర్గాలకే పెద్దపీట వేసేవారు. ఇప్పుడు అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని కోరుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం కోర్టులో ఉన్న విష యం తెలిసిందే. పార్టీ పదవుల విషయంలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు చోటు కల్పించి సామాజిక న్యాయం పా టించాలనే ఒత్తిడి పెరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాల్లో చాలా మంది నాయకులు పదవుల కో సం ఎదురు చూస్తున్నారు.

అనేక మంది నాయకులు పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. దీంతో  పార్టీ కోసం ఐదేళ్లుగా కష్టపడి పనిచేసినవారికే బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి బంధువులు కూడా పార్టీ పదవులకు దూరంగా ఉండాలనే షర తు విధించడంతో కొంత మంది ఆశావాహులకు ప్రతికూలంగా మారింది.

ఇక డీసీసీ అ ధ్యక్ష ఎంపిక విషయంలో ఏఐసీసీ నియమించిన 22 మంది పరిశీలకులు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యా డర్ నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. ఈ నెల 25న ఏఐసీసీ ప్ర ధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌తో ఏఐసీసీ పరిశీలకు సమావేశం కానున్నారు.

రాష్ట్రం లో నెలకొన్న రాజకీయ పరిస్థితు లు, పార్టీ శ్రేణుల నుంచి తీసుకు న్న అభిప్రాయాలు, పదవుల కో సం పోటీ పడుతున్న ఆశావాహులు జాబితాను కేసీ వేణు గోపాల్‌కు ఏఐసీసీ పరిశీలకులు వివరించను న్నారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. 

కష్టపడి పనిచేసే వారికే బాధ్యతలు  

గతంలో జిల్లా ముఖ్య నాయకులంతా కలిసి డీసీసీ అధ్యక్షుడి పేరును పార్టీ అధిష్ఠానానికి సిపారసు చేసేవారు. మరి కొంత మంది ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుని పదవులు దక్కించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి కాంగ్రెస్ అధిష్ఠానం చెక్ పెట్టింది. దీంతో పార్టీ కోసం కష్టపడినవారికి పదవులు దక్కుతాయని అభిప్రాయం ఆశావాహుల్లో ఏర్పడింది. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా, హైదరాబాద్‌ను పార్టీ పరంగా మూడు జిల్లాలుగా విభజించడంతో మొత్తం 35 మంది డీసీసీ అధ్యక్షులను నియమించనున్నారు.

ఇంకా భర్తీకాని పీసీసీ స్థాయి పదువులు, పార్టీ అనుబంధ సంఘాల కమిటీల్లోనూ అన్ని వర్గాలకు చోటు దక్కేలా చూడాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. ప్రభుత్వ పరంగా స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం కొంత ఆలస్యమైనా పార్టీ పరంగా పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటిస్తే.. కాంగ్రెస్ వల్లే అందరికీ అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవడానికి వీలుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.