30-09-2025 06:40:55 PM
రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా సద్దుల బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలతో నిర్వహించారు. శ్రీనివాస్ నగర్ సండే మార్కెట్ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లతో బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. పెద్ద ఎత్తున మహిళామణులు హాజరై బతుకమ్మలు ఆడుతూ, పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వేడుకలు వైభవంగా సాగాయి. జడ్జిల పరిశీలనలో ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు.
మొదటి బహుమతి రూ.20,000 – ఊరెళ్ల లక్ష్మి
రెండవ బహుమతి రూ.15,000 – విజయలక్ష్మి
మూడవ బహుమతి రూ.10,000 – రాములమ్మ
అదనంగా ఐదు మంది విజేతలకు పట్టు చీరలు కన్సోలేషన్ ప్రైజెస్ గా అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.