calender_icon.png 30 September, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం

30-09-2025 06:38:22 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి 17వ డివిజన్ లో విజయదుర్గ కాలనీ రోడ్ నెంబర్ 2 నుండి జగిత్యాల రోడ్డు వి పార్కు హోటల్ బాలాజీ నగర్ వెళ్లే రహదారికి ఇరువైపులా చెట్లను తొలగించగలరు. 17వ డివిజన్ రేకుర్తి వర్క్ షాప్ వెనకాల గల విజయదుర్గ కాలనీ రోడ్ నెంబర్ 2 నుండి వి పార్కు నుండి జగిత్యాల మెయిన్ రోడ్డుకు వెళ్లే రహదారికి ఇరువైపులా ముళ్ళ చెట్లు ఇతర చెట్లు పొదలుగా మారి రెండు వైపులా గుబురుగా పెరిగి ప్రజలకు రవాణా రాకపోకాలకు ఇబ్బందిగా మారి, ఖాళీ నడక నడిచే వారికి తీవ్ర అంతరాయం ఏర్పడి ఆ రోడ్డులో వాహనాలు వెళ్లడం కూడా చాలా కష్టంగా ఉంది.

పండుగల సమయంలో ప్రజలంతా ఇబ్బందులకు రాకపోకలకు గురవుతున్నారు. బస్తిలో పారిశుద్ధం లోపించింది. ఇరువైపులా రోడ్డుకి పెరిగిన చెట్లను తొలగించి రాకపోకాలకు ఇబ్బంది లేకుండా చెయ్యాలని బీజేపీ పశ్చిమ జోన్ కన్వినర్ జాడి బాల్ రెడ్డి మున్సిపల్ కమీషనర్ కు ఇన్వార్డ్ లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాంపల్లి శంకర్, దుర్గం మోహన్, గొల్ల శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.