15-10-2025 12:00:00 AM
-నాగర్‌కర్నూల్ జిల్లాలో లైన్‌మన్, సిరిసిల్ల జిల్లాలో సర్వేయర్..
సిరిసిల్ల/కల్వకుర్తి, అక్టోబర్ 14: రెండు వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం మాచినోనిపల్లికి చెందిన రాజు అనే రైతు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గ్రామంలో లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న నాగేందర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. రైతు రూ.15 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చున్నాడు. ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మండల కేంద్రంలో లంచం తీసుకుంటున్న లైన్‌మన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని జిల్లా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.
సిరిసిల్లలో సర్వేయర్ వేణు..
సిరిసిల్ల పట్టణంలో వేణు సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. బాధిత రైతుకు చెందిన చిన్న బోనాల ప్రాంతంలోని 3ఎకరాల భూమి సర్వే కోసం వేణు లంచం డిమాండ్ చేశాడు. మొదటగా రూ.10వేలు తీసుకున్న వేణు..సర్వే పూర్త యిన తర్వాత మిగిలిన రూ.20 వేలు ఇవ్వాల ని డిమాండ్ చేశాడు. ఈ మేరకు మంగళవారం రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.