15-10-2025 12:00:00 AM
ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జిల్లాలో అక్రమ, అసాంఘి క కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి సాగు నిర్మూలనకు ప్రత్యేక సెర్చ్ టీంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి కేసులో న్యాయం కలిగించేలా దర్యాప్తు చేయాలని, సస్పెక్ట్, రౌడీ షీట్లపై ప్రత్యేక నిఘా అవసరమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. దీపావళి నేపథ్యంలో బాణాసంచా దుకాణాల వద్ద పర్యవేక్షణ చేయాలని, మహిళల భద్రతకు షీ టీంలు ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ చిత్తరం జన్, డీఎస్పీ వాహిదుద్దీన్ తదితర అధికారులు పాల్గొన్నారు.