05-10-2025 05:47:27 PM
పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి..
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అతివృష్టి వాతావరణం నెలకొని పత్తి రైతులు చిత్తయ్యారు. పత్తి సాగు రైతులు విత్తనాలు విత్తినప్పుడు వర్షాలు లేక ఇబ్బంది పడగా అనంతరం కురిసిన వర్షాలతో రైతులలో ఆనందం వెల్లువిరిసింది. అయితే వర్షాలు తిరిగి అదే పనిగా కురియడంతో పత్తి పంటలు భూమి అరకపోవడంతో, జాలువారి పత్తి మొక్కలకు వేరుకుళ్ళు వ్యాపించడం పూలు సరిగా పోయాకపోవడం, పత్తి కాయలు కుళ్ళిపోవడం వంటివి జరగడంతో రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీంతో రైతులు తాము పత్తి పంట సాగుతో తీవ్రంగా నష్టపోయామని పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.