28-10-2025 01:38:26 PM
నకిరేకల్-అర్వపల్లి రహదారిపై పత్తి రైతుల ఆందోళన..
నడిరోడ్డుపై పత్తిని తగలబెట్టిన రైతులు
నకిరేకల్,(విజయక్రాంతి): ప్రకృతి సహకరించుకోవడంతో కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకొచ్చిన పత్తి నాచర్ రాకపోవడంతో రైతులు(Cotton farmers protest) దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టిన పెట్టుబడులు చేసిన కష్టం చేతికి వస్తుందో రాదో అనేఆందోళన రైతుల్లో మొదలైంది. నాచర్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం. నకిరేకల్-అర్వపల్లి (రహదారిపై పత్తి రైతులు ఇవాళ మెరుపు ఆందోళనకు దిగారు. దీంతో ఆ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. వివరాల్లోకి వెళితే.. శాలిగౌరారం మండల పరిధిలోని మాదారం కలాన్ టి ఆర్ ఆర్ కాటన్ మిల్ వద్ద పత్తి రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేయడం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం ఎక్కువగా ఉందని.. కొనుగోలు కేంద్రాలకు వ్యయ ప్రయాసలకు ఓర్చి తీసుకొచ్చిన పత్తిని తిరిగి వెనక్కి పంపుతున్నారని ఆవేదన వ్యక్తి చేశారు.
అనంతరం పత్తికి నిప్పు పెట్టి నకిరేకల్-అర్వపల్లి రహదారిపై రైతులు బైఠాయించారు . పంట పండించడం ఒక ఎత్తైయితే.. అమ్మడం కూడా అంతకు మించి భారంగా మారిందని రైతులు వాపోతున్నారు, సీసీఐ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెడుతూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం అన్నదాతలు పత్తిని పెద్ద మొత్తంలో సాగు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, కొనుగోలు కేంద్రాలు రైతుల కష్టనష్టాలను అర్థం చేసుకొని నాచర్ తో సంబంధం లేకుండా వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు తీగల వెంకన్న, సత్యనారాయణ, శంకర్ ,సైదులు, నజీర్, యాదయ్య, బలరాం, గంగమ్మ తదితర రైతులు పాల్గొన్నారు.