calender_icon.png 28 October, 2025 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో పిల్లలమర్రి నుంచి చాట ఊరేగింపు

28-10-2025 01:46:54 PM

వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

చిన్నచింతకుంట: పల్లె ప్రజల ఆరోగ్య దైవం పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణలతో  మారుమోగుతుంది.  మండల కేంద్రంలోని చిన్న వడ్డేమాన్ గ్రామంలో ఉద్దాల కార్యక్రమంలో భాగంగా  వారం రోజులపాటు నియమ నిష్ఠలతో దళితులు తయారుచేసిన స్వామి వారి పాదుకులను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పల్లె ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఉద్ధాల కార్యస్థలం కిక్కిరించిపోయింది.

-పిల్లలమర్రి నుంచి చాట ఊరేగింపు..

 పిల్లలమర్రి గ్రామంలో వారం రోజులపాటు నియమ నిష్ఠలతో మేదర్లు తయారు చేసిన చాటను ఎమ్మెల్యే  జి మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ అందంగా అలంకరించిన ట్రాక్టర్ ఫై  చాటను నుంచి బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా లాలుకోట,నెల్లికుండి, పెద్ద వడ్డేమాన్ గ్రామాల మీదగా చిన్న వడ్డేమాన్ లోని ఉద్దాల కర్మాగారంకు మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటుంది. అర్ధరాత్రి ఉద్దాల మహోత్సవం ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు.