calender_icon.png 28 October, 2025 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతుల కష్టాలు.. సీసీఐ ఛైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ

28-10-2025 03:34:58 PM

హైదరాబాద్: ముంబైలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Cotton Corporation of India) కార్యాలయంలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాతో(Lalit Kumar Guptaమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పత్తి రైతులు(Telangana cotton farmers) ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులపై ఆయనతో చర్చించి, లేఖను అందజేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. అకాల వర్షాలతో పత్తి పంటలు దెబ్బతిన్నాయని  సూచించారు. రాష్ట్రంలో పత్తి పంట సాగు విస్తీర్ణం 45 లక్షల ఎకరాలకు పైగా ఉందని, అయితే ఈ సీజన్‌లో అకాల వర్షాలు, సైక్లోన్ ప్రభావం, పురుగు దాడులు, పెరిగిన ఉత్పత్తి ఖర్చులు రైతులను తీవ్రంగా కుంగదీశాయని పేర్కొన్నారు.

పత్తికి కనీస మద్దతు ధర (Minimum Support Price) ప్రకటించినా, మార్కెట్‌లో రైతులు దాన్ని పొందలేకపోతున్నారు. తేమ శాతం నిబంధనను 12 నుంచి 14 శాతానికి పెంచాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతులకు మద్ధతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పింక్ బాల్ వార్మ్(Pink ball worm) వల్ల పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలన్నారు. గత సీజన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోమటిరెడ్డి కోరారు. మార్కెట్ యార్డుల వద్ద తేమ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి విజ్ఞప్తిపై రైతుల సమస్యలను కేంద్రంతో చర్చించి పరిష్కరిస్తామని సీసీఐ ఛైర్మన్ హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా ఉన్నారు.