25-10-2025 01:08:02 AM
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, అక్టోబర్ 24 (విజయక్రాంతి): పత్తిని సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జనగామ మండలం లోని, ఓబుల కేశవపూర్ గ్రామం నందు గల శ్రీ వేంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీస్ నందు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 8,110/- గా నిర్ణయించిందని..8 నుండి 12% వరకు తేమ శాతం ఒక్కో శాతం పెరిగిన మేరకు, ధర కూడా ఒక శాతం తగ్గుతుందన్నారు.
12% కంటే ఎక్కువ తేమ శాతం ఉన్న పత్తిని సిసిఐ వారు కొనుగోలు చేయరని... రైతులందరు ఈ విషయాన్ని దృష్టి లో ఉంచుకొని, ఇంటి దగ్గరే పత్తిని ఆరబెట్టుకొని సరైన తేమ శాతం తీసుకొచ్చి మద్దతు ధర పొందగలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో అన్ని జాగ్రత్త చర్యలు తప్పకుండ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో మార్కెటింగ్ అధికారి నరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్, మార్కెట్ కమిటీ మెంబర్స్, సీసీఐ అధికారులు నర్సి రెడ్డి జీన్నింగ్ మిల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.