calender_icon.png 27 October, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీఐతో దక్కిన పత్తి మద్దతు ధర

27-10-2025 07:14:06 PM

- 9 మంది రైతులు నుండి 109 క్వింటాళ్ల పత్తి కొనుగోలు 

- మద్దతు ధర పొందిన ముగ్గురు రైతులు

గజ్వేల్: ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించడంతో గజ్వేల్ లో రైతులకు పత్తి మద్దతు ధర దక్కింది. క్వింటాలు పత్తికి రూ. 8110 ప్రభుత్వం ప్రకటించగా, గజ్వేల్ లో సోమవారం ప్రారంభమైన సీసీఐ కేంద్రంలో 9 మంది రైతులు 109 క్వింటాళ్ల పత్తి విక్రయించారు. వీరిలో ముగ్గురు రైతులకు క్వింటాలుకు రూ.8110 ధర లభించగా, మరో ముగ్గురు రైతులకు రూ.7900ల చొప్పున ధర లభించింది. మిగతా రైతులు క్వింటాలుకు రూ.7700 చొప్పున ధరను పొందారు. కాగా తేమ శాతం తక్కువగా ఉండే విధంగా పత్తిని బాగా ఆరబెట్టి సీసీఐ కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.