calender_icon.png 27 October, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లం రాజు చేసిన సేవలు చిరస్మరణీయం

27-10-2025 07:11:37 PM

ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు..

గజ్వేల్: గజ్వేల్ మాజీ ఎంపీపీ, కొల్గూర్ మాజీ సర్పంచ్ మల్లం రాజు చేసిన సేవలు చిరస్మరణీయమని మల్కాజి గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావులు అన్నారు. మల్లం రాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా సోమవారం గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లం రాజు ప్రజలకు, మండల ప్రజలకు చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచాయన్నారు. మల్లం రాజు లాంటి నిస్వార్థ ప్రజా నాయకులను యువత ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, మల్లం రాజు సతీమణి మల్లం సుమతి,  అభిరాజ్,  ప్రసన్న, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడి పల్లి భాస్కర్, పట్టణ బిజెపి అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ కంటు సుభాష్ చంద్రబోస్, మండల నేత బారు అరవింద్  తదితరులు పాల్గొన్నారు.