calender_icon.png 9 January, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవిత కొత్త పార్టీ నడపడం అంత ఈజీ కాదు!

08-01-2026 01:15:36 AM

కవిత నేరుగా వచ్చి రాజీనామా ఇస్తే అప్పుడే అమోదించేవాడిని

మీడియాతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్‌చాట్

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్త పార్టీలకు స్పేస్ లేదని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవి త పొలిటికల్ పార్టీ నడపడం అంత ఈజీకాదని, పార్టీని నిలబెట్టుకోవడం చాలా కష్టమ ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇపుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో మరో పొలిటికల్ పార్టీ నడపడం కష్టమన్నారు. ఇప్పటికే చా లా రాజకీయ పార్టీలు ఉన్నాయి.. చిరంజీవి, దేవెందర్‌గౌడ్ పార్టీలు పెడితే ఏమయ్యాయో చూశామని వెల్లడించారు. రాజీ నామాను సభ్యులు కాకుండా ఇతరుల ఇస్తే రాజీనామా ఆమోదం కాదని, కవిత ఇన్ పర్సన్ ఇచ్చారు ఆమోదం తెలిపామన్నారు.

మొదట కవిత రాజీనామా పీఏ ద్వారా పంపించారని, ప్రెస్ మీట్‌లో రాజీనామా లేఖ పంపించిన్నట్లు మాట్లాడారన్నారు. ఇలా చేస్తే రాజీనామా అమోదించలేమని, ఇటీవల నేరుగా కలిసి రాజీనామా అమోదించాలని కోరారని చెప్పారు. కవిత నేరుగా వచ్చి రాజీనామా ఇస్తే అప్పుడే అమోదించేవాడిని. తనకు ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కవిత కోరినట్లు తెలిపారు. రిజైన్ చేసే వారు ఎవరికైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, శాసనసభ్యులు, మండలి, పార్లిమెంట్‌లో ఎక్కడైనా ఇలా ఇస్తారన్నారు. బీఆర్ఎస్, ఆమె కుటుంబంపై కవిత చేసిన కామెంట్లు ఆమె వ్యక్తిగతమని ఆయన తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కి చాలా ఇబ్బందులు ఉన్నాయని, అంత సులువు కాదు ఆయన పేర్కొన్నారు.