calender_icon.png 9 July, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీసాట్‌తో ఉన్నత విద్యామండలి ఎంవోయూ

06-12-2024 02:07:47 AM

హైదరాబాద్, డిసెంబర్5(విజయక్రాంతి): ఉన్నత విద్యలో విద్యార్థులకు విస్తృత సేవలు అందించేందుకు గానూ టీలూఠసాట్‌తో తెలంగాణ ఉన్న త విద్యామండలి అవగాహన ఒప్పందాన్ని గురువారం కుదుర్చుకున్నది. అధ్యాపకులకు, విద్యార్థులకు అధునాతనమైన సబ్జెక్టులపై నైపుణ్యం పెంచే శిక్షణా కార్యక్రమాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బోధించేందుకు ఈ ఒప్పం దం కుదుర్చుకున్నట్లు మండలి చైర్మ న్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు, స్పెష లైజేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించేందు కు ఈ ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి కార్యా లయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీసాట్ సీఈవో బి.వేణుగోపాల్ రెడ్డి, మండలి వైస్ చైర్మన్లు ప్రొ.పురుషోత్తం, ఎస్‌కే మహమూద్, సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్ పాల్గొన్నారు.