06-12-2024 02:11:36 AM
అదనపు బాధ్యతలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబర్5(విజయక్రాంతి): విద్యాశాఖ ముఖ్యకార్యద ర్శిగా సీనియర్ ఐఏఎస్ ఎన్.శ్రీధర్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించిం ది. పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈమేరకు సీఎస్ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనే కొనసాగుతారని సీఎస్ తెలిపారు. ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశంను ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. వాలంటరీ రిటైర్మెంట్‌కు ప్ర భుత్వం అనుమతినివ్వడంతో ఆయన స్థానంలో ఎస్సీ డెవలప్‌మెంట్ ము ఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.