23-09-2025 06:07:23 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో గత వారం రోజుల నుంచి మృతి చెందిన బాధిత కుటుంబాలను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాదిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సవిత భర్త సామ రాంరెడ్డి, తాటిపాముల కిష్టా గౌడ్, కుమ్మరి బుచ్చవ్వ తదితరులు మృతి చెందారు. మృతి చెందిన వారు తిరిగి రారని గట్టి మనసుతో ముందుకు సాగాలని కోరారు. కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజుగౌడ్, భుజంగం, మైపాల్ రెడ్డి, బాల్ రెడ్డి, మంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.