23-09-2025 06:10:17 PM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కోర్టులో 2025-26 సంవత్సరానికి గాను సైకిల్, స్కూటర్, కారు స్టాండ్ నిర్వహణ అనుమతి కోసం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సైకిల్ స్కూటర్ స్టాండ్ నిర్వహణకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు సూపరింటెండెంట్(అకౌంట్స్), ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్ హనుమకొండ పేరున 27వ తేదీన మూడు గంటల్లోగా రూ. 1000ని డిపాజిట్ చేసి అదే రోజున సాయంత్రం నాలుగు గంటలకు కోర్టు కాంప్లెక్స్ లో నిర్వహించే బహిరంగ వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. నియమ నిబంధనల మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడించారు.