15-05-2025 02:18:10 AM
ప్రిన్సిపల్ ఇంద్రజ
నాగల్ గిద్ద, మే 14 : ఈనెల 16 నుంచి గిరిజన గురుకుల కళాశాలలో అడ్మీషన్ల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి గిరిజన గురుకుల పాఠశాలలో ప్రి న్సిపాల్ ఇంద్రజ తెలిపారు. సంగారెడ్డి రీజియన్ గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సంగారెడ్డి జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణా రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల, మనుర్, కరస్ గుత్తిలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సిఇసి ,హెచ్‌ఇసి గ్రూపులలో ప్రవేశాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇందుకు ఈనెల 16న ఉదయం 11.00 గంటలకు పివిటిజి కళాశాల(బాలురు) హయత్ నగర్ లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్ కు హాజరుకానున్న విద్యార్థులు బదిలీ ధృవీకరణ పత్రము, పదవ తరగతిలో సాధించిన మార్కుల మేమో (2024-25), స్టడీ, కండక్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము (2024-25, గ్రామీణ ప్రాంతమునకు సంభందించిన వారైతే రూ.1,50,000, పట్టణ ప్రాంతానికి చెందిన వారైతే రూ.2,00,000 ఆదాయం మించరాదని, ఆధార్ జిరాక్స్, స్పోరట్స్, అర్ఫాన్, పీహెచ్సీ ధృవీకరణ పత్రాలు, 3 కలర్ ఫోటోలు, రెండు జతల నకలు కాపీలుతో హాజరు కావాలని కోరారు. ఎంపీసి, బైపిసి గ్రూపులలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశం పొందగోరే అమ్మాయిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదనపు సమాచారం కొరకు 88856 09167 నంబర్కు సంప్రదించాలనికోరారు.