calender_icon.png 17 May, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి

15-05-2025 02:18:50 AM

పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు 

కరీంనగర్, మే14 (విజయక్రాంతి): మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని ఫిల్మ్ భవన్‌లో పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా 5 వ మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్  అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్ అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమం లో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  నక్క నారాయణ రావు మాట్లాడుతూ ఉమ్మడి పౌరహక్కుల సం ఘం జిల్లా కమిటీ సింగరేణి ఓపెన్ కాస్ట్ ల విధ్వంసానికి వ్యతిరేకం గా, ఇటుక బట్టీలలో ఒరిస్సా కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకం గా దళితులపై, మైనారిటీ వర్గాల పై దాడు లకు వ్యతిరేకంగా, రాజ్య హింస కు వ్యతిరే కంగా పోరాటాలు నిర్వహించిందని అన్నా రు.

పౌరహక్కుల సంఘం నాయకులు కామ్రేడ్ గోపి రాజన్న, జాపా లక్ష్మారెడ్డి, అజాం ఆలీ, డాక్టర్ రామనాథం, నర్రా ప్రభాకర్ అక్రమ హత్యలు మొదలు జగి త్యాల, రేచ్ పల్లి కి చెందిన పోగుల రాజేశం ను అక్రమంగా అరెస్ట్ చేసిందని, అతని కూతురు ను అల్లుడు హత్య చేస్తే కూతురు చివరి చూపుకు నోచుకోకుండా బెయిల్ ఇవ్వకుండా హింసించిందని ఆరోపించారు. వెంటనే పోగుల రాజేశం విడుదల చేయా లనీ డిమాండ్ చేశారు.

జర్నలిస్ట్, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమా ధాన్, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ కగార్ పేరుతో, అభివృద్ధి పేరుతో ఆదివాసీలను వారికీ మద్దతుగా ఉన్న మావోయిస్టు లను బూటకపు ఎన్ కౌంటర్ ల పేరుతో హత్యలు చేస్తున్నాదని అన్నారు.

ఆదివాసుల హక్కుల కోసం సుప్రీం కోర్ట్‌లో కేసులు వేసిన గాం దేయ వాది హిమాన్ష్ కుమార్ కు రాజ్యం ప్రోధ్భలంతో సుప్రీం కోర్ట్ 5 లక్షల జరి మానా విధించిందని, బాసగూడలో  వ్యవ సాయ పనుల గురుంచి మాట్లాడటం కోసం సమావేశామైన స్థానిక ప్రజలపై కేంద్ర ప్రభు త్వ సాయుధ బలగాలు తూటాల వర్షం కురుపించి 12 మందిని హత్యా చేసిందని ఆరోపించారు. 

కేంద్రం పెసా చట్టాన్ని, రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూ ల్‌లను, అటవీ హక్కుల చట్టం, గ్రామసభ తీర్మాణాలను అమలు చేయా , కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు అనుకూలంగా ఉన్న మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.