calender_icon.png 24 August, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు క్రమశిక్షణను పెంచుతాయి

15-05-2025 02:16:31 AM

జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్‌రెడ్డి

క్రీడాకారులకు జెర్సీలు పంపిణీ చేసిన ఎస్పీ

మెదక్, మే 14(విజయక్రాంతి): విద్యార్థినులు క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో రాణించాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. బుధవారం  ఇందిరా గాంధీ స్టేడియంలో క్రీడాకారులకు స్పొరట్స్ జెర్సీ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జి ల్లా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ ఫూట్బాల్ వుమెన్స్ లీగ్ కు సెలెక్ట్ అయ్యి నిజామాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న విద్యార్థులకు అభినంధనలు తెలియజేశారు.

రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి క్యాంప్ కు సెలెక్ట్ కావాలని కోరారు. క్రీడలు ఆ డడం వలన మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని అన్నా రు. చాలా మంది  విద్యార్థులు చదువును మద్యలో ఆపేసి చెడు అలువాట్లకు బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సులభమైన మార్గంలో డబ్బును సంపాధించాలన్న ఆశతో  బె ట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి  ప్రాణాల మీదకు తెచ్చుకుంటునారని తెలిపారు. యువతను, విద్యార్థులను ఎక్కువ మందిని క్రీడలు ఆడే విధంగా  చొరవ చూపించాలని అన్నారు. అ నంతరం విద్యార్థులతో కలసి ఫూట్బాల్ ఆడి జెర్సీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ ఓ దేవేందర్ రెడ్డి, మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు,  పిడి నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.