calender_icon.png 31 January, 2026 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత

31-01-2026 03:24:02 PM

వెల్గటూర్,(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలో సీఎం సహాయనిధి చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్దిదారులకు అందజేశారు. ఇందులో వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన  ఎర్రోళ్ల లక్ష్మీ రూ.60,000, నేరెళ్ల తిరుపతి లకు రూ.17వేల విలువగల చెక్కులు అందించారు.పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందనీ ఈ సందర్బంగా  కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, మాజీ ఉపసర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డీ, యూత్ కాంగ్రెస్ జిల్లా జెనరల్ సెక్రటరీ గండ్ర శ్రీకాంత్ రావు, బిసి సెల్ మండల అధ్యక్షుడు బందెల ఉదయ్ గౌడ్, గుమ్ముల అజయ్ తదితరులు పాల్గొన్నారు.