03-11-2025 02:14:09 AM
యాదాద్రి భువనగిరి, నవంబర్ 2 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ జాతీయ రహదారి బీబీనగర్ చెరువు కట్టపై ఉన్న రోడ్డులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కకు ఆగి ఉన్న బైక్‌ను 150 కి.మీ.ల వేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. యాదాద్రి జిల్లా రాజాపేటకు చెందిన గర్దాస్ ప్రశాంత్(32)కు, వరంగల్‌లోని పాలకుర్తికి చెందిన ప్రసూన(28)కు మూడేళ్ల క్రితం పెళ్లుంది. ఉపాధి కోసం బోడుప్పల్‌లోని టెలిఫో న్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉద యం బైక్‌పై సొం తూరుకు దంపతులిద్దరు బైక్‌పై బయలుదేరారు. బీబీనగర్ చెరువుకట్ట వద్దకు చేరుకో గానే ఫోన్ రావడంతో పక్కకు నిలిపి మాట్లాడుతున్నారు.
వెనక నుంచి 150కి.మీ వేగంతో దూసుకొచ్చిన కారు వారిని ఢీకొట్టింది. ప్రసూన ఎగిరి చెరువుకాలువలో పడి మృతి చెందింది. 20 అడుగుల దూరంలో ప్రశాం త్ పడి మృతిచెందాడు. బైక్ ముక్కలు కాగా తార్ వాహనం చెట్టుకు ఢీకొట్టి సర్వీస్ రోడ్డుపై పల్టీ కొట్టి నుజ్జునుజ్జయింది. వాహనంలో ఉన్న ముగ్గురు యువ కులకూ గాయాలయ్యాయి. ఆ ముగ్గురు యువకులు మద్యంతాగి, అతివేగంగా డ్రైవింగ్ చేయడం తోనే జరిగినట్టు తెలుస్తున్నది. యువతి మృతదేహాన్ని ఎన్డీఎఫ్ సిబ్బంది చెరువులో గాలించి, బయటకు తీశారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిం చారు. బీబీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.