రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
మేడిపల్లి, మార్చి 15 (విజయక్రాంతి): కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. గోదావరిఖని కి చెందిన మర్రి ప్రశాంత్ (38) అతడి భార్య శ్రావణి (35) కుమారుడు సహస్రాన్ (10) తో కలిసి హైదరాబాదులోని రాంనగర్ లో నివసిస్తున్నారు. మర్రి ప్రశాంత్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ప్రైవేటు ఉద్యో గం చేస్తున్నాడు.
ఆదివారం మేడిపల్లి లోని చుట్టాల ఇంటికి వస్తుండగా డెకథ్లాన్ షోరూం దగ్గర వెనుక నుండి వచ్చిన కారు కియా సోనేట్ అదుపుతప్పి వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మర్రి ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రావణి ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. వారి కుమారుడు ప్రమా దం నుండి బయటపడ్డాడని, కారు నడిపిన వ్యక్తి రామయ్య సర్వే ఆఫ్ ఇండియా సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.




