21-11-2025 11:29:59 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): నెన్నల్ మండలంలోని కర్జి గ్రామంలో శుక్రవారం రాత్రి అమెరికా గుడిమల్ల మమత అనే ఎన్ఆర్ఐ సహకారంతో బెల్లంపల్లి రూరల్ సిఐ హనూక్ ఆధ్వర్యంలో 150 మంది నిరుపేదలకు మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ చలి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిసిపి భాస్కర్ మాట్లాడుతూ చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో నిరుపేదలకు చలి నుండి రక్షణ కల్పించేందుకు సామాజిక బాధ్యతగా కర్జీ గ్రామంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజల సహకారంతో పోలీసు వ్యవస్థ మరింత బలపడుతుందని, సామాజిక సేవలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. నిరుపేదలకు దుప్పట్లను అందజేసి ఔదార్యం చూపిన గుడిమల్ల మమత ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.