calender_icon.png 3 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి సురేఖకు కోర్టు షాక్

03-08-2025 12:52:14 AM

కేటీఆర్ పరువు నష్టం కేసులో క్రిమినల్ విచారణకు నాంపల్లి కోర్టు ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (వి జయక్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కో ర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి  కే తారక రామారావు వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కింద ఈ కేసు ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఆగస్టు 21వ తేదీలోగా మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. కేటీఆర్‌పై చేసిన ఆరోపణలు మంత్రి కొండా సురేఖ మెడకు చుట్టుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, నటి సమంత విడాకుల అంశాలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు న ష్టం దావా వేశారు.

కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలతో ఏకీభవిం చిన న్యాయస్థానం, కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ప్రాథమికంగా నిర్ధారించింది. ఫిర్యాదుతోపాటు సమ ర్పించిన సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ప త్రాలను పరిశీలించిన తర్వాత, మంత్రి సురేఖపై ప్రాథమికంగా కేసు ఉన్నట్లు కోర్టు గు ర్తించింది.

ఈ దశలో కొండా సురేఖ తరపు న్యాయవాది లేవనెత్తిన అభ్యంతరాలను, ఫిర్యాదు ఊహాజనితమని, సరైన ఆధారం లేదని, కోర్టు పరిధి వంటి అంశాలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఫిర్యాదు ను స్వీకరించే అధికారం కోర్టుకు ఉందని స్పష్టంచేస్తూ, కేసు నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించింది.

ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారాలతో పాటు, సినీ నటి సమంత-నాగచైతన్య విడాకుల వెనుక కేటీఆర్ ఉన్నారంటూ గతంలో మంత్రి సురే ఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యా ఖ్యలు తన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించాయని పేర్కొంటూ కేటీఆర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇదే వ్యవహారంలో సినీ నటుడు నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు.