calender_icon.png 3 August, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

03-08-2025 12:51:40 AM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఉపాధ్యాయ, విద్యారంగ సమస్య లు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్  జిల్లా ఉపాధ్యక్షులు జె.రాంబాబు వి.సరియ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం లక్ష్మీదేవిపల్లి మండలంలో వివిధ పాఠశాలలలో క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంగా ఉపాధ్యాయులతో వారు మాట్లాడుతూ...ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు కావస్తున్న సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుందని, ఈ నిర్లక్ష్యధోరణిని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయు లంత పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని ఉపాధ్యాయులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డీఈవోల స్థానంలో జిల్లా కలెక్టర్లకు ఇన్చార్జివ్వడాన్ని  పునరాలోచించుకోవాలని నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి,

ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలని, ఉపాధ్యాయుల పెన్షనర్ల, వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్రాథమిక పాఠశాలలకు 5571 పియస్‌ హెచ్‌యం పోస్టులను మంజూరు చేసి,  గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలలో పండిట్స్, పిఈటి పోస్టులను అప్గ్రేడ్ చేయాలని ప్రాథమిక పాఠశాలకు పిఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేసి పదోన్నతులు కల్పించాలని,  ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని, హైకోర్ట్ తీర్పు ను అనుసరించి 2003 డి.ఎస్. సి. ఉపాధ్యాయులకు పాతపెన్షన్ ను వర్తింపజేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలని, 317 జిఓ బాధిత ఉపాధ్యాయులకు స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు కేటాయించాలని, గురుకుల టైం టేబుల్ సవరించాలని, కెజిబివి, మోడల్‌ స్కూల్స్‌ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని, కే జి బి వి,  యూ ఆర్ ఎస్,  సమగ్ర శిక్ష, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, మోడల్ స్కూల్, గురుకుల సిబ్బందికి 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించాలనే ఉత్తర్వులను ఉపసంహారించాలని, విద్యారంగంలో ఎన్ జి ఓ ల జోక్యాన్ని నివారించాలని, అన్ని జిల్లాలకు శానిటేషన్ గ్రాంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.