calender_icon.png 1 January, 2026 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైన్స్ షాపుల వసూళ్లపై సీపీ దృష్టి

01-01-2026 02:05:55 AM

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 31 : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వైన్ షాపుల లైసెన్స్ య జమానుల నుంచి కొందరు వ్యక్తులు డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఇటీవల పత్రికలలో వచ్చిన వార్తలపై పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ స్పందించారు. వైన్ షాపులపై ఏవై నా ఫిర్యాదులు, సమస్యలు ఉంటే, జిల్లా లే దా రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.అలా కాకుండా, ఎవరైనా బ్లాక్మెయిల్కు పాల్పడినా లేదా డబ్బు డిమాండ్ చేసినా నేరంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు. ఏ వి ధమైన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, బాధితులు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.