calender_icon.png 1 January, 2026 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాసంగికి సరిపడా యూరియా నిల్వలు

01-01-2026 02:07:10 AM

జిల్లా కలెక్టర్ కె.హైమావతి 

సిద్దిపేట కలెక్టరేట్,డిసెంబర్31: జిల్లాలో యాసంగి సీజన్కు సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెం దవద్దని జిల్లా కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ రైతు వేదికలో యూ రియా కార్డుల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యాసంగిలో ఎక్కడా యూరియా కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని కేంద్రాల్లో సరఫరా కొనసాగుతున్నట్లు తెలిపారు.

రైతులు పాస్బుక్తో వచ్చి యూరియా కార్డులు తీసుకోవాలని సూచించారు. ఒక ఎకరాకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కౌలు రైతులకు కూడా పట్టేదార్ పాస్బుక్ లేదా జిరాక్స్ ఆధారంగా యూరియా అందిస్తామని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కొరత వార్తలను నమ్మవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.