calender_icon.png 7 November, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో ఘనంగా వందేమాతర గీతం ర్యాలీ

07-11-2025 05:02:13 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తిలో వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులతో పోలీసులు అధికారులు మమేకమై వందేమాతరం గీతంతో శుక్రవారం మెయిన్ రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జాతీయ జెండాలను చేతిలో పట్టుకొని, వందేమాతరం గేయం పాడుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తహశీల్దార్ దయానందం, ఎస్ఐ క్రాంతి కుమార్ లో మాట్లాడుతూ యువత సమాజసేవలో రాణిస్తూ దేశ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అశోక్ కుమార్, పిడి యాకయ్య మాజీ సర్పంచ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది విద్యార్థులు, పాల్గొన్నారు.