07-11-2025 05:09:14 PM
హనుమకొండ,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో వందేమాతరం 150 ఏళ్ల జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీ నక్కలగుట్ట కాలోజి జంక్షన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలుతో సాగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద గుజ్జుల అరుణ బృందం చే పూర్తి వందేమాతర గీతాన్ని సామూహికంగా ఆలపించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ వందేమాతర 150 వ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి భారతీయుడు వందేమాతరం గొప్పతనాన్ని తెలుసుకోవాలన్నారు. వందేమాతర ఉద్యమం తోనే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నారు. మాజీ మేయర్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ మైనారిటీల ప్రసన్నత కోసం వందేమాతరం లోని దేవి దుర్గమ్మ, భారత్ మాత అంశాలు ఉన్న చరణాలను తొలగించిందని విమర్శించారు.150 సంవత్సరాల వేడుకలు జరుపుకునే సందర్భంలో ప్రతి భారతీయుడు వందేమాతరం యొక్క అసలు అర్థం తెలుసుకుని గర్వపడాల్సిన సమయం వచ్చింది అని పేర్కొన్నారు.