07-11-2025 01:35:17 AM
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో 11.14 కోట్ల ఆస్తులు జప్తు
మనీలాండరింగ్‌కు పాల్పడ్డారా?
లోతుగా విచారిస్తున్న ఈడీ
కంపెనీల్లో వాటా ఉన్నట్టు తేలితే ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు జైలుకే..
ముంబై, నవంబర్ 6 : భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో వీరిద్దరికీ చెందిన రూ.11.14 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఆ కంపెనీల్లో వెనుక వీరికి వాటాలున్నాయా అనే కోణంలోనూ లోతు గా దర్యాప్తు చేస్తోంది. గతంలో 1ఎక్స్ బెట్‌కు వీరిద్దరూ ప్రచారకర్తలుగా వ్యవహరించారు.
ఇటీవలే కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వారందరినీ పిలిచి విచారణ జరు పుతోంది. ఈ క్రమంలో రైనా, ధావన్‌లను గతంలోనే ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించింది. దాదాపు 8 గంటలకు పైగా సాగిన అప్పటి విచారణలో పలు కీలక వివరాలు సేకరించింది. బెట్టింగ్ యాప్స్ కంపెనీలతో ఉన్న సంబంధాలు, ఎంత పారితోషకం తీసుకున్నారు ? మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించడంపైనా విచారణ జరిపింది.
ఆ యాప్స్ ప్రమోట్ చేసిన క్రమంలో వీరిద్దరూ తీసుకున్న పారితోషకాలకు సంబంధించి వివరాలు సేకరించిన ఈడీ రూ.11.14 కోట్ల విలు వైన ఆస్తులను జప్తు చేసింది. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసే క్రమంలో విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్ను ఎగ్గొట్ట డం వంటి కేసుల నమోదు చేసినట్టు తెలుస్తోంది.
అదే సమయంలో సదరు కంపెనీల్లో వీరికి వాటాలున్నట్టు తేలితే మాత్రం కఠిన శిఖలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే వీరిద్దరూ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారా లేక కంపెనీల్లో వాటాదారులుగా ఉన్నారా అన్న దానిపై ఈడీ లోతుగా విచారిస్తోంది. ఒకవేళ బెట్టింగ్ యాప్స్‌లో వాటా ఉందని తేలితే మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కనీ సం 3 నుంచి ఏడేళ్ళ జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కోటి రూపాయల వరకూ జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది.
కేంద్రం కొత్త తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుతో డ్రీమ్ 11 వంటి యాప్స్‌పై నిషేధం విధించారు. అలాంటి ఆన్‌లైన్ గేమిం గ్ కంపెనీలన్నీ భారత్‌లో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసాయి. గతంలో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోట్ చేసిన వారి లో కేవలం క్రికెటర్లు మాత్రమే కాకుండా సినీ, టీవీ పరిశ్రమలకు చెందిన నటులు కూడా ఉన్నారు. వీరిని కూడా ఇటీవలే ఈడీ విచారించింది.