calender_icon.png 7 November, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో వందేమాతరం గీతాలాపన

07-11-2025 05:00:12 PM

వందేమాతరం గీతాన్ని ఆలపించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జిల్లా అధికారులు, ఉద్యోగులు

హనుమకొండ,(విజయక్రాంతి): బంకించంద్ర  ఛటర్జీ దేశభక్తి గీతం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా  హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం వందేమాతరం గీతాలాపన చేశారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ , జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని  దేశభక్తి గీతం వందేమాతరం గీతాన్ని ఆలపించారు. దేశ  స్వాతంత్రోద్యమంలో దేశవాసులందరికీ స్ఫూర్తిని నింపిన బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తిచేసుకుంది.

కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150ఏళ్ల ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించడంతో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొని వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ మేన శ్రీను, సిపిఓ సత్యనారాయణరెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి మహమ్మద్ గౌస్ హైదర్ ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.