సీపీగెట్ ఫలితాలు విడుదల
- 93.54 శాతం మంది ఉత్తీర్ణత
- మహిళలు 29,365మంది, పురుషులు 13,158 మంది పాస్
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 52,697 మంది దరఖాస్తు చేసుకోగా 45,462 మంది పరీక్ష రాశారు. వీరిలో 42,526 (93.54) శాతం మంది అర్హత సాధించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, వైస్‌చైర్మన్ పురుషోత్తం, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్, సీపీగెట్ కన్వీనర్ రాజేందర్ కట్లాతోపాటు ఇతర అధికారులు కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. మహిళలు 36,106 మంది దరఖాస్తు చేసుకోగా, 31,534 మంది పరీక్ష రాశారు.
వీరిలో 29,365 (93.1) శాతం ఉత్తీర్ణత సాధించారు. పురుషులు 16,587 మంది దరఖాస్తు చేసుకోగా 13,925 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 13,158 (94.49) శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక నలుగురు ట్రాన్స్‌జెం డర్స్ దరఖాస్తు చేసుకోగా ముగ్గురు పరీక్ష రాయగా వారు ఉత్తీర్ణులయ్యారు. మహిళలకంటే పురుషుల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉన్నప్పటికి నీ సంఖ్యా పరంగా చూస్తే మహిళలే ఎక్కువగా ఉన్నారు. కొన్నేళ్లుగా ఉన్నత విద్యనభ్యసిస్తున్నవారిలో వీరే ఎక్కువగా ఉన్నారు. ఈ సంద ర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సంస్కరణలు చేపట్టవలసిన అవసరమున్నదని తెలిపారు.






