నేడు ఉరుములు మెరుపులతో వర్షాలు
06-08-2026 12:00 AM
ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని హెచ్చరించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వనపర్తి, మెదక్, వికారాబాద్, రాజన్న సిరిసిల్లా, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురువగా మిగిలిన జిల్లాల్లో అతితేలికపాటి వర్షాలు కురిశాయి.






