14-07-2025 01:30:01 AM
దేవరకొండ, జులై 13: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ )నల్లగొండ జిల్లా 23వ మహాసభ దేవరకొండలో జూలై 15న జరిగే మహాసభను జయప్రదం చేయాలనీ సిపిఐ పట్టణ కార్యదర్శి వలమల్ల ఆంజనేయులు పిలుపునిచ్చారు.
ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రజాకార్లకు, జాగీర్దార్లకు, దొరల, భూస్వామ్య దోపిడీ, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం ద్వారా దున్నే వానికే భూమి కావాలని ఉద్యమించి లక్షలాది ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిన చరిత్ర సిపిఐది అని వారు అన్నారు.నల్లగొండ జిల్లాకు శాశ్వత కరువు నివారణలో భాగంగా చేపట్టిన ఎస్‌ఎల్బిసి సొరంగ నిర్మాణం, డిండి ఎత్తిపోతల పథకం, మైనర్ ఇరిగేషన్ పథకాలకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిధులు కేటాయించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. సమావేశంలో పట్టణ సహాయ కార్యదర్శి జూలూరి జ్యోతిబస్, జూలూరి వెంకట్రాములు, నాగేష్, ఎండి మైనొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.