14-07-2025 01:27:12 AM
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు(మర్రిగూడ), జూన్ 13 : మునుగోడు నియోజకవర్గం లో కంటి సమస్యతో బాధపడేవారు ఏ ఒక్కరు కూడా ఉండకూడదు అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో పోటీ తత్వం పెరగాలని పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐదవ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఇప్పటికే నాలుగు ఉచిత కంటి వైద్య శిబిరాలతో 682 మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేయించమన్నారు.10 పదివేల మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.ఉచిత కంటి వైద్య శిబిరంలో మర్రిగూడ మండల వ్యాప్తంగా 900 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
వీరిలో 230 మంది కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారు. వెంటనే 129 మందిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని శంకరా కంటి ఆసుపత్రికి ఆపరేషన్ కి తరలించారు.మిగిలిన 101 మందిని తర్వాత పంపిస్తామని అన్నారు. 2024-2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థినికి 15000 రూపాయలు, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థినికి 10000 రూపాయలు, తృతీయ స్థానం సాధించిన విద్యార్థినికి 7500 రూపాయల నగదు బహుమతిని అందించి, శాలువాతో సన్మానించి మెమెం టో అందించారు.
పదవ తరగతిలో మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించిన వారికి 25 వేల రూపాయలు, ద్వితీయ స్థానం సాధించిన వారికి 15వేల రూపాయలు, తృతీయ స్థానం సాధిం చిన విద్యార్థిని విద్యార్థులకు పదివేల రూపాయలు అందజేస్తానన్నారు. ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విద్యార్థులు, కంటి వైద్య బాధ్యతలు ఉన్నారు.
కోట మృతి పట్ల గుత్తా, కోమటిరెడ్డి సంతాపం
నల్లగొండ టౌన్, జూలై 13: ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు మృతి పట్ల శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రోడ్లు భవనములు, సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం వేరువేరు ప్రకటనలతో సంతాపం ప్రకటించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.నాలుగు దశాబ్దాల తన సినీ కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన 750కి పైగా సినిమాల్లో నటించారు. కోట శ్రీనివాస రావు ఆహ నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగారు ప్రతి ఘటన సినిమాతో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. వారు మృతి చెందడం సినిమా ఇండస్ట్రీస్ కి తీరని లోటు అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.