23-01-2026 12:02:45 AM
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య.
మరిపెడ, జనవరి 22 (విజయక్రాంతి): మరిపెడ పురపాలక సంఘం ఎన్నికల్లో సిపి ఎం పార్టీ 5 వార్డులలో పోటీ చేయనున్నట్లు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అలవాల వీరయ్య ప్రకటించారు. గురువారం మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక ప్రజాసం ఘాల కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ మరిపెడ మున్సిపాలిటీ లో 15 వార్డులు ఉండగా, అందులో ఐదు వార్డులకు గాను సిపిఎం స్వతంత్రంగా పోటీ చే యనున్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన వార్డులలో ప్రజా సమస్యల పరిష్కారానికి అ నుకూలంగా ఉన్నవారికి మద్దతునిస్తామని ప్రకటించారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో గత అనేక సంవత్సరాలుగా సీతారాం పురం ఇందిరా నగర్ కాలనీ, రామ విలాస్ బజారు. మైనార్టీ కాలనీ, హౌసింగ్ బోర్డు, తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయకుండా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ లు మున్సిపాలిటీ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
వచ్చిన కోట్ల రూపాయల నిధులను ఏం చేశారో బహిరంగంగా ప్రకటించాలని సవాల్ చేశారు. 465 సర్వే నెంబర్లు పేదలు కట్టుకున్న ఇండ్లను తొలగించాలని ఆనాటి పాలకులు తీవ్ర ప్రయత్నం చేయగా సిపిఎం ఎర్రజెండా వారికి అండగా నిలబడి గుడిసెలను కాపాడిందన్నారు. వర్షం వస్తే కాలనీ లన్నీ బురదమయంగా మారుతున్నాయని ఇన్నేళ్లయిన పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అభివృద్ధి మాత్రం జరగడంలేదని వీరయ్య మండిపడ్డారు.
అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సిపిఎం ను ఆదరించాలని, మున్సిపల్ వ్యాపారస్తులపై విపరీతమైన పన్నులు వేస్తుంటే బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు వాటిని నియంత్రించలేకపోయాయని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం కు ప్రాతినిథ్యం కల్పిస్తే ప్రజల హక్కుల కోసం నిలబడుతుందన్నారు.
ఈ సమావేశంలో మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్, పట్టణ కార్యదర్శి దొంతు సోమన్న, పార్టీ ఆర్గనైజర్ బాణాల రాజన్న, బోడ పట్ల రాజశేఖర్, కొండ ఉప్పలయ్య, దొంతు మమత, కందాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.