calender_icon.png 23 January, 2026 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గులాబీ ఆపరేషన్ ఆకర్ష్!

23-01-2026 12:01:41 AM

ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

బీఆర్‌ఎస్లోకి వలస వెళ్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు

తాజాగా మెదక్లో కాంగ్రెస్ పార్టీకి షాక్

గులాబీ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నాయకులు

సంగారెడ్డి, జనవరి 22(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యా ప్తంగా ప్రధాన పార్టీలు గెలుపు, ఓటమిలపై బేరీజులు వేసుకుంటున్నాయి. అందులో భా గంగానే ధీటైన అభ్యర్థుల వేట కూడా మొదలైంది. ఇలావుండగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాలను పొందలేక పోవడంతో ఈసారి మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.

ఎలాగైనా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక స్థానాల్లో మున్సిపల్ స్థానాలను గెలుపొందాలని వ్యూహాలు పన్నుతుంది. అయితే అధి కార పార్టీ వ్యూహాలు పన్నుతుంటే మరోవైపు గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ధీటైన జవాబు చెప్పినప్పటికీ కొ న్ని నియోజకవర్గాల్లో పట్టుకోల్పోయింది. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పీఠాలను కైవ సం చేసుకొని ఉమ్మడి జిల్లాలో గులాబీ స త్తా చాటాలని ప్రయత్నాలు మొదలుపెట్టిం ది. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. 

బీఆర్‌ఎస్‌లోకి వలసలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా లో 11, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉండగా ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆయా రిజర్వేషన్ల స్థానాల్లో పోటీలో ఉండే ఆశావహుల సంఖ్య భారీగానే ఉండడంతో ధీటైన అభ్యర్థుల కోసం వడపోత మొదలు పెట్టారు. మరోవై పు బీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపి కాంగ్రెస్, బీజేపీ నుండి భారీ సంఖ్యలో వలసలను ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడింట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయా నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో సైతం గులాబీ జెం డా ఎగురవేయడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.

అనుకున్నట్లుగానే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నుండి బీఆర్‌ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి హరీష్రావు ప్రత్యేక దృష్టి పెట్టి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలను బీఆర్‌ఎస్లోకి లాగి పార్టీ కండువా కప్పుతున్నారు. తాజాగా గురువారం నాడు హైదరా బాద్లోని హరీష్రావు స్వగృహంలో సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్చెరుకు చెందిన పలువురు కీలక నాయకులు బీఆర్‌ఎస్లో చేరారు. కాగా వీరిలో టికెట్టు ఆశిస్తున్న వారు కొందరైతే కాంగ్రెస్, బీజేపీలో పొసగలేక బయట పడుతున్న వారు మరికొందరు ఉన్నారు. ప్ర ధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిద్యం వహిస్తున్న ఆందోల్, నారాయణఖేడ్, మెదక్ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలను బీఆర్‌ఎస్లో చేరేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

బీఆర్‌ఎస్‌లో చేరిన మెదక్ కాంగ్రెస్ నేతలు

మెదక్ పట్టణంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత లు కొందరు గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక్కడ ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుకు చెక్ పెట్టేందుకు హరీష్రావు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నేతలను బీఆర్‌ఎస్లో చేర్చుకున్నారని తెలుస్తోం ది. మెదక్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రె స్ నేత కొండన్ సురేందర్గౌడ్తో పాటు పలువురు హరీష్రావు సమక్షంలో చేరారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలినట్లయింది. మెదక్ జిల్లాలో నాలుగు మున్సి పాలిటీలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.