01-08-2025 12:00:00 AM
అశ్వాపురం, జూలై 31 (విజయక్రాంతి) :అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు గ్రా మంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం పార్టీ నాయకులు రాజీలేని పోరాటానికి శ్రీకారం చుట్టారు. జిల్లా నాయకులు రేపకుల శ్రీనివాసరావు, మండల నాయకులు స్థానిక నాయకులు గురువారం మల్లెల మడుగు గ్రామంలో ఇంటింటి పర్యటన చేపట్టి స్థానిక సమస్యలను తె లుసుకుంటూ, ప్రజల అభిప్రాయాలు సేకరించారు .
సిపిఎం నాయకుడు బ్రహ్మచారి మాట్లాడు తూ గ్రామాల్లో ఎన్నో సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి, వాటికి పరిష్కార మార్గం చూపడమే ముందున్న లక్ష్యం అని తెలిపారు. పార్టీ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి రాజీకి పోకుండా పోరాడుతామని నాయకులు స్పష్టం చేశారు.
ఇంటింటి పర్యటనల ద్వారా ప్రజల భవిష్యత్తు కోసం సిపిఎం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, స్థానిక నాయకులుపాల్గొన్నారు.