calender_icon.png 2 August, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొంటాల బాబుకి కాంగ్రెస్ నాయకుల నివాళులు

02-08-2025 02:53:52 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): మాజీ వార్డు కౌన్సిలర్ రొంటాల బాబు అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజరాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో బాబు స్వగృహంలో కాంగ్రెస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల పుష్పలత, కాంగ్రెస్ అధికార ప్రతినిధి సొల్లు బాబు, రొంటాలబాబు పార్థివదేహానికి శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తొలి తరం ఎమ్మార్పీఎస్ నాయకుడిగా, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్గా ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఎంతోమంది యువ నాయకులకు రాజకీయ భవిష్యత్తు చూపిన నాయకుడని కొనియాడారు. వారి వెంట ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రవీందర్, సునీత, రాధతో పాటు తదితరులు ఉన్నారు.