02-08-2025 03:09:32 PM
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి..
చిట్యాల (విజయక్రాంతి): భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గురుకులాలపై చేస్తున్న అసత్యపు ఆరోపణలు మానుకోవాలని, విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు చిత్తశుద్ధి ఉందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి(Congress Mandal Party President Gootla Tirupati) అన్నారు. శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గండ్ర సత్యనారాయణ రావు గెలుపొందిన అనతికాల వ్యవధిలోనే కస్తూర్బా గాంధీ పాఠశాలకు 20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే స్థానిక సంస్థల ఎన్నికల కోసం అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, చిట్యాల టౌన్ అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్, యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్, గడ్డం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.