01-08-2025 12:00:00 AM
బోయినపల్లి జూలై 31(విజయక్రాంతి): బోయినపల్లి మండలంలోని జగ్గారావు పల్లి గ్రామం లో క్షయ వ్యాధి పై అవగాహనను టీబీ ముక్త్ భారత్ అభియాన్ ద్వారా మం డల ప్రాధమిక ఆరోగ్యకేంద్ర వైద్య అధికారి డాక్టర్ శిరీష. ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శిరీష మాట్లాడుతూ షుగర్, క్యాన్సర్, బీపీ, దీర్ఘకాళికా వ్యాధులు, పొగ తీసుకునే వారిలో క్షయ వ్యాధికి గురయ్యేఅవకాశం ఎక్కువగా ఉన్నాయని ఆమె చెప్పారు.
క్షయ లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు జ్వరం, ఆకలి లేకపోవడం, రా త్రిపూట చెమటలు పట్టడం,బరువు తగ్గడం వున్నవారు.తేమడ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆ మే సూచించారు.టీబీ ముక్త్ భా రత్ అభియాన్ నిర్వహించిన కార్యక్రమంలో 78 మంది కి పైగా టీబీ స్క్రీనింగ్ చేశామ ని15 మంది అనుమానితుల నుండి తేమడ నమూనాలనుసేకరించి ల్యాబ్ కు పంపించమన్నారు. 06 మంది సింటామెటిక్ వాళ్ళని ఎక్సరే వేములవాడకు పంపించామని చెప్పా రు.
మెడికల్ కాలేజీ రేడియోలాజి ల్యాబ్ కి పంపించామని అందులో క్షయ వ్యాధి నిర్దారణ అయిన వారికీ 6 నెలల పాటు పూర్తి ఉచితంగా పరీక్షలు, మందులు ఇస్తామన్నా రు. అలాగే నిక్షయ్ పోషన్ ద్వారా వ్యాధిగ్రస్థులకు నెలకి1000/- రూపాయలు పావష్టి కహారం కోసం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, సూపర్వైజర్లు, అరవింద్, కృప, ( ఎస్ టీ ఎస్) గంగాధర్, ల్యాబ్ టెక్నీషియన్ ప్రకాష్, ఆరోగ్య కార్యకర్త పద్మ , ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.