02-08-2025 02:51:19 PM
5వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి..
సిద్దిపేట (విజయక్రాంతి): ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(Telangana Progressive Teachers Federation) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గాడిపల్లి తిరుపతిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూతన ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు కావస్తున్న సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణిని అవళంబిస్తున్నదని, ఈ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 5న జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులంత పెద్దఎత్తున ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని ఉపాధ్యాయులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డీఈవోల స్థానంలో జిల్లా కలెక్టర్లకు ఇన్చార్జివ్వడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
నూతన జిల్లాలకు డిఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు యంఈఓ కోసం ప్రతి పోస్టులను మంజూరు చేసి, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను రూపొందించి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయలని, ఉపాధ్యాయుల పెన్షనర్ల, వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్రాథమిక పాఠశాలలకు 5571 పియస్ హెచ్‌యం పోస్టులను మంజూరు చేసి, పండిట్, పిఈటిల అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జిఒ 2,3,9,10 లను రద్దు చేసి జిఒ 11,12 ల ప్రకారం పదోన్నతులు కల్పించాలని, ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని, హైకోర్ట్ తీర్పు ను అనుసరించి 2003 డి.ఎస్. సి. ఉపాధ్యాయులకు పాతపెన్షన్ ను వర్తింపజేయాలి. సి.పి.ఎస్. విధానాన్ని రద్దు చేయాలి.
వివిధ జిల్లాల్లో జరిగిన పైరవీ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని,317 జిఓ బాధిత ఉపాధ్యాయులకు స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు తీసుకురావాలని, గురుకుల టైం టేబుల్ సవరించాలని, కెజిబివి, మోడల్ స్కూల్స్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని, కే జి బి వి, యూ ఆర్ ఎస్, సమగ్ర శిక్ష, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, మోడల్ స్కూల్, గురుకుల సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలలోని పండిట్, పిఇటి పోస్టులను అప్ గ్రేడ్ చేసి వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించాలనే ఉత్తర్వులను ఉపసంహారించాలని, విద్యారంగంలో ఎన్ జి ఓ జోక్యాన్ని నివరించాలని, అన్ని జిల్లాలకు శానిటేషన్ గ్రాంట్స్ విడుదల చేయాలని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు మనోహర్, యూ ఎస్ పి సి నాయకులు డి మల్లయ్య, పి శ్రీనివాస్ గౌడ్ ,అశోక్ రెడ్డి, రాజేందర్, మురళీకృష్ణ, కృష్ణ ,వినోద్ గౌడ్, బాల సరస్వతి, శ్రీలత , పద్మావతి,ఉదయశ్రీ ,బాల లక్ష్మి,సరస్వతి, కృష్ణవేణి జ్యోతి, శశికళ, మొదలగు వారు పాల్గొన్నారు.