02-08-2025 02:59:18 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): మందమర్రి డివిజన్(Mandamarri Division) పరిధిలోని కెకె-5లో జరిగిన గని ప్రమాదంలో రాసపల్లి శ్రావణ్ కుమార్(32) అనే కార్మికుడు మృతి చెందాడు. రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన రాసపల్లి శ్రావణ్ కుమార్ కెకె-5 గనిలో రెండవ షిఫ్టు అసిస్టెంట్ ఎస్డీఎల్ ఆపరేటర్(జనరల్ మజ్దూర్) గా 81 ప్యానల్ 4సిమ్ వద్ద తను విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎస్డీఎల్ మొరయించగా ఆ యంత్రన్ని పరిశీలిస్తున్న సమయంలో సైడ్ వాల్ కూలి బొగ్గు పెల్ల పడటంతో గాయాల పాలైన తనని తోటి కార్మికులు హుటాహుటిగా కేకే డిస్పెన్సరీ తీసుకెళ్లగా అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యసేవల కొరకు కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో శ్రావణ్ కుమార్ మృతి చెందాడు.