02-08-2025 02:40:25 PM
అలంపూర్: పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా న్యాయమూర్తి ప్రేమలత(District Judge Premalatha) అన్నారు. శనివారం గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణంలో న్యాయమూర్తి మిథున్ తేజ, విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది ఫారెస్ట్ అధికారులు, ఎంఈఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు.