calender_icon.png 6 July, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ వైద్యులపై కొరడా

06-07-2025 01:00:44 AM

  1. హైదరాబాద్ శివారులో మెడికల్ కౌన్సిల్ తనిఖీలు

8 మందిపై కేసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): నగర శివారు ప్రాం తాల్లో అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై తెలంగాణ రాష్ర్ట మెడికల్ కౌన్సిల్ ఉక్కుపాదం మోపింది. బౌరంపేట్, దుండిగల్, సూరారం పరిసర ప్రాం తాల్లో మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ జి శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ కెయుఎన్ విష్ణు నేతృత్వంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి,

8 మంది నకిలీ వైద్యులను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులు ఎలాంటి అర్హత లేకుండానే క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో ఆధునిక అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు తేలింది.

వీరిపై ఎన్‌ఎంసీ చట్టం, తెలంగాణ స్టేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రెగ్యులేషన్ యాక్ట్,  భారతీయ న్యాయ సంహిత కింద కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేష్‌కుమార్ మాట్లాడుతూ.. అర్హత లేని వైద్యుల వద్దకు వెళ్లొద్దని సూచించారు.